పెద్దాపురం విశాలాక్షి నగర్‌లో ఉమ్మెళ్ల ప్రసాద్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు సామర్లకోట భీమేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో, దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని ₹4 లక్షల విలువైన బంగారు నగలు, కిలో వెండిని దోచుకెళ్లారు.
బాధితుడి ఫిర్యాదుతో సీఐ విజయ్ శంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పట్టణంలో వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.










