పుంగనూరు నియోజకవర్గం సదుంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, ఆయన చూపిన ధైర్యం మరియు ప్రజా సంక్షేమ పాలనను కొత్తూరు మురళి తదితరులు స్మరించుకున్నారు.
అన్ని వర్గాల ప్రజలకు సమాన గౌరవం ఇచ్చి, భారతీయ ధర్మాన్ని రక్షించిన వీరుడు శివాజీ అని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










