అన్నమయ్య జిల్లా మదనపల్లి బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన **’ఆర్ కన్వెన్షన్ హాల్’**ను రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ప్రారంభించారు.
శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన పలు గృహప్రవేశ వేడుకల్లో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇలాంటి అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మదనపల్లి అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరగడం సంతోషకరమని చినబాబు పేర్కొన్నారు.










