విశాఖలో వాటర్ ట్యాంకర్ ప్రమాదం: కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్

0
1

విశాఖ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వద్ద వాటర్ ట్యాంకర్ ప్రమాదానికి గురవ్వడంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కాంప్లెక్స్ నుండి బీచ్‌లోని బోట్లకు నీరు సరఫరా చేసేందుకు వెళ్తుండగా, వాహనం ఇరుసు విరిగి రోడ్డుపైనే నిలిచిపోయింది.

ట్యాంకర్‌లోని నీరంతా రోడ్డుపై పారడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. మెకానిక్ వచ్చి వాహనాన్ని మరమ్మతు చేయడంతో ట్రాఫిక్ పునరుద్ధరించబడింది. నిత్యం జరిగే పనుల్లో ఇలాంటి ఆటంకం కలగడంపై డ్రైవర్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.