అమరావతిలో జరిగిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు.
2027లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనాభా గణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చేపట్టేందుకు కేంద్ర అధికారులు దిశానిర్దేశం చేశారు. తొలి దశ (హౌస్ లిస్టింగ్) ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు జరగనుండగా, 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కింపు జరుగుతుంది.
ఈ ప్రక్రియ కోసం సిబ్బందిని సన్నద్ధం చేయాలని, డేటా నాణ్యతలో రాజీ పడకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.










