నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ కార్పొరేటర్ మురళీకృష్ణ ఈరోజు తన డివిజన్లో పర్యటించారు. స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వీధుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు.
ప్రధానంగా నిలిచిపోయిన డ్రైనేజీలను క్లియర్ చేయించి, పేరుకుపోయిన చెత్తను సిబ్బందితో శుభ్రం చేయించారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడమే తన ప్రథమ ప్రాధాన్యతని, డివిజన్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్థానికులు ఆయన చొరవను అభినందించారు.
