తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి, క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి.
టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న (శుక్రవారం) 68,156 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు నమోదైంది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అదనపు ఈవో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.










