ఏపీలో మార్చి 16 నుండి ఒంటిపూట బడులు: విద్యాశాఖ ఉత్తర్వులు

0
1

పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

పాఠశాలలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతాయి. అయితే, పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.

తెలంగాణలోనూ ఇదే తేదీ నుండి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.