చీరాలలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’: ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ భావన వశిష్ట

0
0

చీరాలలో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి కలెక్టర్ భావన వశిష్ట పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ నుండి మున్సిపల్ హైస్కూల్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి, వ్యర్థ రహిత పాలనపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ఇదే వేదికపై ఈనెల 26న రేపల్లెలో జరగనున్న జాబ్ మేళా గోడపత్రాలను ఆమె విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

#Narendra