డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి: రెడ్డి సాహెబ్

0
0

మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మదనపల్లెలో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన ‘డ్రగ్స్ నిర్మూలన’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని, యువతను రక్షించేందుకు పాలకులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు వామపక్ష నాయకులు, మేధావులు పాల్గొన్నారు.