మదనపల్లె మండలం పనసమాకులపల్లిలో ఆవు చేనులో మేసిందనే నెపంతో దంపతులపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన కుక్కల నగేష్ సహా ఐదుగురు తనపై, తన భార్య ఆదిలక్ష్మిపై దారుణంగా దాడి చేశారని బాధితుడు శంకర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నపాటి వివాదంతో మొదలై దాడి వరకు వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది.










