తమిళనాడులోని కొడైకెనాల్లో తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూర్యనారాయణ (73) దారుణంగా హత్యకు గురయ్యారు.
ఆదివారం తెల్లవారుజామున తన సొంత బంగళాలోకి చొరబడిన దుండగులు, ఆయనను కుర్చీకి కట్టేసి, నోటికి టేపులు వేయడంతో ఊపిరాడక మృతి చెందారు.
మృతుడు ఒకప్పటి నటి విష్ణుప్రియ తండ్రిగా గుర్తించారు. ఇది కేవలం దోపిడీ కాదని, పాత కక్షల నేపథ్యంలో జరిగిన ప్రతీకార హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఐదుగురు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
