తిరుమల లడ్డూ వివాదం: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

0
0

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దినేశ్‌కుమార్ కమిటీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కమిటీని సవాలు చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ (SIT) దర్యాప్తుకు, ఈ ఏకసభ్య కమిటీ విచారణకు సంబంధం లేదని, రెండూ వేర్వేరుగా కొనసాగవచ్చని స్పష్టం చేసింది. దీంతో దోషులపై చర్యల సిఫార్సుల ప్రక్రియకు మార్గం సుగమమైంది.