పుంగనూరులో వైభవంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

0
0

పుంగనూరు పట్టణంలో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ట్రావెల్స్ బంగ్లా నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగింది.

హిందూ సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివాజీ జయంతి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సుబ్బరాయుడు నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

# కొత్తూరు మురళి.