ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్‌గా తమ్మినేని నవీన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.
ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ఒక ‘రోల్ మోడల్’ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటించాలని ఆయన సూచించారు.








