ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య కుటుంబ సభ్యులను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం పరామర్శించారు.
దుర్గా అగ్రహారంలోని వారి నివాసానికి వెళ్లిన ఎంపీ, వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన కుమారులు ఐలాపురం రాజ, అరుణ్ కుమార్లకు సానుభూతి తెలిపారు.
హోటల్ రంగంలో వ్యాపారవేత్తగా, రాజకీయాల్లో బీసీల గొంతుకగా వెంకయ్య చేసిన సేవలను ఈ సందర్భంగా ఎంపీ కొనియాడారు.










