జైన్ సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని శివనాథ్

0
0

విజయవాడ గురునానక్ కాలనీలోని జైన్ తేరాపంత్ భవన్‌ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జైన్ సాధువులు రష్మీమునిశ్రీ, శివయుష్ మునిశ్రీల ఆశీస్సులు తీసుకున్నారు.

రాజస్థాన్ నుంచి పాదయాత్రగా వచ్చిన సాధువులను ఈ సందర్భంగా ఎంపీ కొనియాడారు.

సమాజంలో అహింస, నైతిక విలువల పెంపునకు జైన్ సాధువుల కృషి ఎంతో గొప్పదని, వారి ఆధ్యాత్మిక బోధనలు ప్రజల్లో చైతన్యం నింపుతాయని ఆయన పేర్కొన్నారు.