రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడంతో పాటు, బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు
. కాసులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని, ల్యాబ్ రిపోర్టులు రాగానే దోషులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే డెయిరీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.










