దళిత ద్రోహి మాజీ సీఎం జగన్ వర్ల రామయ్య కామెంట్స్

0
0

వైసీపీ ఐదేళ్ల పాలనలో దళితులపై దాడులు, ఊచకోత జరిగిందని టీడీపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ.

మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్‌ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినా, అప్పటి ప్రభుత్వం పోలీసులతో కుమ్మక్కై కేసును నీరుగార్చిందని ఆరోపించారు.

సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అప్పటి ఎస్పీ, డీజీపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన అన్యాయాలపై సిట్ (SIT) వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.