పులిచెర్ల ఎంఆర్ఓ వేధిస్తున్నారు: కలెక్టర్‌కు దళితుల మొర

0
0

పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండల రెవెన్యూ అధికారి (MRO) తమ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని రెడ్డివారిపల్లి గ్రామ దళితులు ఆరోపించారు.

అగ్రవర్ణాల ఒత్తిడితో 50 దళిత కుటుంబాలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, గృహ నిర్మాణాలకు అడ్డుతగులుతున్నారని ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల పక్షపాత వైఖరి వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

# కొత్తూరు మురళి.