పాలేరు నియోజకవర్గ పరిధిలోని మంగాపురం తండా గ్రామపంచాయతీలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి సర్పంచ్ ధీరవతు అశోక రాణి శ్రీకారం చుట్టారు.
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రామస్థులకు నీటి ఎద్దడి కలగకుండా ఆదివారం నూతన నర్సరీ ఆవరణలో భూమి పూజ నిర్వహించి బోరు బావి వేయించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యమని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.








