తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువులో మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, బాధితులకు న్యాయం జరగాలని ఆయన కోరారు. బాలిక కుటుంబాన్ని బెదిరించానన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
గతంలో బాలిక బాబాయి తనను సంప్రదించినప్పుడు మందలించానని, తాజా ఘటన తెలియగానే పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపారు. బాధిత కుటుంబానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు.









