శ్రీవారి లడ్డూ కల్తీపై రేపు అసెంబ్లీలో పూర్తి వివరాలు: నారా లోకేశ్

0
0

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారంపై రేపు (మంగళవారం) అసెంబ్లీలో ఆధారాలతో సహా పూర్తి వివరాలను వెల్లడిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ..

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మహాపచారంపై ఇప్పటికే సిట్ (SIT) విచారణ పూర్తయిందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడిని రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని, సభను బహిష్కరించిన వైసీపీ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.