సీఎం చంద్రబాబుతో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ |

0
0

అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు.

రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక రంగంలో సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటును సీఎం ఈ సందర్భంగా వివరించారు.

ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.