మార్చి 6 నుంచి ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం!

0
0

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 12 ఏళ్లకోసారి జరిగే కుంభాభిషేక మహోత్సవం మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది.

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఈ మేరకు ఏర్పాట్లను సమీక్షించారు. కంచి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా జరిగే ఈ ఉత్సవానికి మార్చి 8న సీఎం, డిప్యూటీ సీఎం హాజరుకానున్నారు.