ఆసుపత్రుల్లో అగ్నిమాపక తనిఖీలు: నిబంధనలు పాటించకుంటే చర్యలు

0
0

విజయవాడ నగరంలోని ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై నగరపాలక సంస్థ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాలాద్రి, భవానీపురంలోని అమ్రిన్ హాస్పిటల్‌ను పరిశీలించారు.

అగ్నిమాపక సామాగ్రి పనితీరును తనిఖీ చేయడంతో పాటు, ప్రమాదం సంభవిస్తే పరికరాలను ఎలా ఉపయోగించాలో సిబ్బందికి ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు.