నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం: వజ్రబాబు వివరణ

0
0

తనపై మరియు తన సోదరుడిపై వస్తున్న ఉద్యోగ మోసం ఆరోపణలను వజ్రబాబు తీవ్రంగా ఖండించారు. శాలెం రాజు అనే వ్యక్తి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ఇది కేవలం వ్యక్తిగత కక్షతో చేస్తున్న దుష్ప్రచారమని పేర్కొన్నారు.

తన డ్రైవర్‌కు, సదరు వ్యక్తికి మధ్య ఉన్న లావాదేవీల్లో తన పేరును అనవసరంగా లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.