పుంగనూరులో రెండు బైక్‌లు ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు

0
0

పుంగనూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న బైక్‌ను, ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

# కొత్తూరు మురళి.