విద్యాసంస్థల్లో మతోన్మాదానికి తావులేదు: ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశం

0
0

విద్యాసంస్థల్లో ఆర్ఎస్ఎస్ (RSS) కార్యకలాపాలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఆంధ్రా యూనివర్సిటీలో గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, ఎస్ఎఫ్ఐ నేతలు తీవ్రంగా స్పందించారు.

వర్సిటీలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ, విద్యార్థులు మరియు సెక్యూరిటీ ఆఫీసర్ ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్‌పై వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తీర్మానించారు.