తెలంగాణ కేబినెట్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 60 ఏళ్లలోపు ఉద్యోగి సహజంగా మరణిస్తే రూ. 10 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి రూపాయల బీమా పరిహారం అందించే పథకాలకు ఆమోదం తెలిపింది.
అలాగే, మూల వేతనంలో 1.5% కంట్రిబ్యూషన్‌తో ట్రస్ట్ ద్వారా క్యాష్‌లెస్ వైద్యం అందించే కొత్త హెల్త్ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది.









