మదనపల్లి: పోలీస్‌ భవన నిర్మాణాలకు రూ. 10 లక్షల విరాళం.

0
0

అన్నమయ్య జిల్లా పోలీస్ భవన నిర్మాణాల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త టి. కృష్ణప్ప నాయుడు (TKN) రూ. 10 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు.

సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి ఆయన ఈ మేరకు చెక్కును అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పాటునందించడం సామాజిక బాధ్యతగా భావించి ఈ ఆర్థిక సహాయం అందజేసినట్లు TKN పేర్కొన్నారు.