మచిలీపట్నంలోని విజయానంద డిగ్రీ కళాశాలలో కృష్ణా జిల్లా పోలీసులు విద్యార్థులకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు.
మహిళా పోలీస్ స్టేషన్, శక్తి, ఈగల్ టీమ్ సభ్యులు పాల్గొని మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, పోక్సో చట్టం మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించారు.
ఆపద సమయంలో శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి విద్యార్థిని దీనిని మొబైల్లో ఉంచుకోవాలని సూచించారు.










