రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబును మదనపల్లెకు చెందిన మైనార్టీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
రాయచోటిలో జరిగిన ఈ భేటీలో మదనపల్లె పట్టణానికి చెందిన పటాన్ ఖాదర్ ఖాన్, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి షంషీరు బద్రి, ఆయుబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతం మరియు మైనార్టీల సమస్యలపై ఈ సందర్భంగా చర్చించారు.










