తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో బాపట్ల ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట మంగళవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జిల్లా కార్యదర్శి ఎలిజిబెత్ రేఖ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వేతనాల పెంపుపై స్పష్టత లేదని ఆమె విమర్శించారు.
#Narendra










