కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు: తాలూకా పోలీసుల హెచ్చరిక.

0
0

మదనపల్లి మండలం సిటిఎం సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద కోడి పందాలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను తాలూకా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.


సీఐ కళావెంకటరమణ ఆదేశాలతో ఎస్సై రామకృష్ణారెడ్డి బృందం ఈ మెరుపు దాడులు నిర్వహించింది. నిందితుల నుంచి రెండు కోళ్లు, రూ. 5 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జూద క్రీడలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.