జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లె, రామిరెడ్డి లేఅవుట్ పరిసరాల్లో పోలీసులు గురువారం తెల్లవారుజామున భారీ ‘కార్డెన్ సెర్చ్’ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి నేతృత్వంలో 150 మంది సిబ్బంది ఇంటింటినీ తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సేవిస్తూ పట్టుబడిన పలువురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.










