జనసేనాని పవన్ కల్యాణ్ ‘మెంబర్షిప్ టు లీడర్షిప్’ లక్ష్యంతో మూడో విడత సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ ఈ డ్రైవ్ ప్రారంభం కానుంది.
సభ్యత్వ రుసుమును రూ. 400కు తగ్గించి, సభ్యులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు.
పార్టీ శ్రేణులను ఉద్యమి, సాధక్, ప్రదాత అనే మూడు వర్గాలుగా విభజించి, సంస్థాగత క్రమశిక్షణతో కూడిన నాయకత్వాన్ని తయారు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.










