విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి నేతృత్వంలో పోలీసులు గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా భారీ ఆపరేషన్ నిర్వహించారు.
గత 20 నెలల్లో (జూన్ 2024 – జనవరి 2026) అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పట్టుబడిన సుమారు 52,336 కిలోల గంజాయిని, 142 లీటర్ల హషీష్ ఆయిల్ ను ఇన్సినరేషన్ పద్ధతిలో ధ్వంసం చేశారు.
గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన రూ. 9.19 కోట్ల ఆస్తులను అధికారులు ఫ్రీజ్ చేశారు.










