అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్స కోసం ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన మానవత్వాన్ని చాటుకున్నారు.
చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ మరియు చికిత్స కోసం రూ. 6 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. లోకేష్ చూపిన ఈ చొరవతో చిన్నారి కుటుంబంలో కొత్త ఆశలు చిగురించాయి.
రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఆయన చేసిన ఈ సాయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.










