రాయచోటి పట్టణంలోని సుండుపల్లి బైపాస్ రోడ్డు నందు వల్లూరు వాసుదేవ రెడ్డి నూతనంగా నిర్మించిన వి జి ఆర్ లాడ్జ్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు, టిడిపి యువ నాయకుడు మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లాడ్జ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యజమాని వాసుదేవ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ, వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.










