చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండుగల్లుకు చెందిన ఆనంద్ (40) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పుంగనూరు – చౌడేపల్లె రహదారిలోని పెట్రోల్ బంకు వద్ద తన స్కూటీపై నిలబడి ఉండగా, వేగంగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆనంద్‌ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
# పుత్తూరు మురళి.
