మదనపల్లి మండలం మిట్టపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మంటలకు రైతు పూల వెంకటప్ప సాగు చేసిన రెండున్నర ఎకరాల టమోటా పంట పూర్తిగా బుగ్గిపాలయ్యింది.
కోతకు సిద్ధంగా ఉన్న పంటతో పాటు డ్రిప్పు పైపులు, కట్టెలు కాలిపోవడంతో సుమారు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లింది. అప్పులు చేసి పండించిన పంట కళ్లముందే బూడిద కావడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
