Sunil Nayak: ఐపీఎస్ సునీల్ నాయక్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్.

0
0

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు గుంటూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

గత వారం బీహార్‌లో ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటికీ, సాంకేతిక కారణాలతో పాట్నా కోర్టు ట్రాన్సిట్ రిమాండ్‌ను తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం తాజా వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ఏపీ ప్రత్యేక బృందం బీహార్‌లో నిఘా పెంచింది.