పుంగనూరు పట్టణంలోని కోనేటిపాలెం వద్ద 15 అడుగుల లోతున్న నీటి సొంపులో పడిపోయిన ఎద్దును అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు.
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు నేతృత్వంలో సిబ్బంది తాడు, నిచ్చెనల సహాయంతో స్థానికులతో కలిసి మూగజీవిని బయటకు తీశారు. ప్రాణాపాయం నుంచి ఎద్దును కాపాడిన అగ్నిమాపక బృందాన్ని కోనేటిపాలెం గ్రామస్తులు అభినందించారు.
# కొత్తూరు మురళి .










