రూ. 456 కోట్లతో వెలుగొండ పనులు.. దోర్నాలలో సీఎం శ్రీకారం.|

0
0

దోర్నాల మండలం గంటవానిపల్లిలో రూ. 456 కోట్లతో నిర్మించనున్న వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎంకు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.

ఈ ప్రాజెక్టు ద్వారా వెలుగొండ ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యమని, పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.