వెలుగొండ కెనాల్ పనుల పరిశీలన: శంకుస్థాపనకు సిద్ధమైన దోర్నాల.

0
0

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకను పురస్కరించుకుని, పెద్ద దోర్నాల మండలంలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ శంకుస్థాపన పనులను డాక్టర్ మన్నే రవీంద్ర, ఏఎంసీ చైర్మన్ అప్పారావు మంగళవారం పరిశీలించారు.

సుమారు 200 మంది కార్యకర్తలతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వెన్న వెంకటరెడ్డి, చేకూరి ఆంజనేయులు తదితరులు పాల్గొని, సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.