హైకోర్టు ఆదేశాల మేరకే భూముల స్వాధీనం: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వివరణ

0
0

ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల స్వాధీనం పూర్తిగా హైకోర్టు ఆదేశాల మేరకే జరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు.

ఆ భూములపై వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిందని ఆయన వెల్లడించారు.

సుమారు రూ. 250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి రక్షించామని, ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు ప్రభుత్వం తరపున ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.