Home South Zone Andhra Pradesh ఉగాది నాటికి పేదల ఇంటి కల సాకారం.. కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి డెడ్ లైన్.

ఉగాది నాటికి పేదల ఇంటి కల సాకారం.. కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి డెడ్ లైన్.

0

జిల్లాలో పేదలందరికీ గృహ నిర్మాణ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు.

గురువారం తన కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహ నిర్మాణ పురోగతిపై ఆయన కీలక సమీక్ష జరిపారు. వచ్చే ఉగాది పండుగ నాటికి జిల్లావ్యాప్తంగా కనీసం 7,187 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఇందుకు సంబంధించి ఎటువంటి జాప్యం జరగకుండా క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

#BOIENA RAJESH

NO COMMENTS

Exit mobile version