తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత సంతాన సాఫల్య కేంద్రాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ఏడేళ్ల నిరీక్షణ తర్వాత, అల్వాల్‌కు చెందిన విజయ (పేరు మార్చబడింది) అనే మహిళ గాంధీ ఆసుపత్రి ఐవీఎఫ్ కేంద్రం ద్వారా తల్లి అయ్యారు.
గతంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం దక్కని ఆమెకు, గాంధీ వైద్య బృందం అక్టోబర్ 2024లో చికిత్స ప్రారంభించింది.
ఫిబ్రవరి 7న సిజేరియన్ ద్వారా 2 కిలోల బరువున్న ఆడబిడ్డ జన్మించగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో ఫిబ్రవరి 25న డిశ్చార్జ్ చేశారు.
ఈ విజయం సాధించిన డాక్టర్ శోభ, డాక్టర్ సుమిత్ర నాయర్, డాక్టర్ ఫాతిమా రాణి బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రైవేటులో రూ. 5 నుండి 10 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను గాంధీ మరియు పేట్లబురుజు ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
#sidhumaroju
Alwal










