Home South Zone Andhra Pradesh తిరుమలలో భక్తజన సంద్రం.. శిలాతోరణం వరకు క్యూలైన్లు.

తిరుమలలో భక్తజన సంద్రం.. శిలాతోరణం వరకు క్యూలైన్లు.

0

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నేడు (శనివారం) భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.


క్యూలైన్లు శిలాతోరణం వరకు దాటి వెలుపలకు విస్తరించాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం (Dharma Darshan) కోసం సుమారు 15 గంటల సమయం పడుతోంది. నిన్న (శుక్రవారం, ఫిబ్రవరి 27) స్వామివారిని 67,952 మంది భక్తులు దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

NO COMMENTS

Exit mobile version